Thursday, April 25, 2024

శింబు-గౌత‌మ్ మీన‌న్ మూవీ ఫస్ట్ లుక్ చూడండి..

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న మూవీ ” వెందు తనిందంతు కాడు ” .. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శింబు ఫస్ట్ లుక్ విడుదలయింది. ఫ‌స్ట్ లుక్‌లో శింబు లుంగీ క‌ట్టి చిరిగిన చొక్కాతో క‌నిపించారు. ఇంటెన్స్ లుక్ లో చాలా డీ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్న శింబు అంచ‌నాలు పెంచేస్తున్నాడు. ఈ సినిమా శింబు కెరీర్‌లో ప్ర‌త్యేకం అవుతుంద‌ని అనిపిస్తుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా పేరుగాంచిన గౌతమ్ మీనన్.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడని అర్థం అవుతోంది.

గౌత‌మ్ మీనన్- శింబు కాంబినేషన్‌పై లో వస్తున్న మూడో మూవీ ఇది..ముందుగా ‘నాదిగలై నీరదమ్ సూర్యన్’ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ని మార్చేసి ”వెందు తనిందంతు కాడు” అని పేరు ఖరారు చేశారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విన్నై తాండి వరువాయాస , ‘అచ్చం యెన్బదు మడమైదా’ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. త‌మిళంలో ఈ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ కావ‌డంతో తెలుగులో అవి నాగచైతన్య హీరోగా ‘ఏమాయ చేసావేస , ‘సాహసం శ్వాసగా సాగిపో’ వచ్చిన సినిమాలు విజయం సాధించాయి.

ఇది కూడా చదవండి: Tokyo Olympics: గోల్డ్ రేసులో గోల్ఫ‌ర్ అదితి అశోక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement