Tuesday, April 30, 2024

ఉప్సి ఆర్సీ లైఫ్ పార్టీలో..బ‌న్నీ.. ఉపాస‌న‌తో ఫొటో

ఉప్సి ఆర్సీ లైఫ్ పేరుతో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పార్టీని ఇచ్చారు. తాజాగా ఉపాసన కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కొణిదెల.. కామినేని కజిన్స్.. ఇతర స్నేహితులు హాజరయ్యారు. స్వీట్ సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సందడి చేయడం విశేషం. అంతే కాదు ఉపాసనతో తీసుకున్న ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ కి అల్లు అర్జున్ ‘సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సి’ అనే కామెంట్ పెట్టడం విశేషం. తాజాగా రాంచరణ్ ఏర్పాటు చేసిన పార్టీకి అల్లు అర్జున్ హాజరు కావడం అల్లు మెగా కామన్ ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. కొణిదెల వారి పార్టీలో పుష్పరాజ్ సందడి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పార్టీకి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా హాజరయ్యారు. వివాహం జరిగిన పదేళ్ల తర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనితో ప్రస్తుతం అందరి చూపు ఉపాసనపైనే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కీలక సమయంలో రాంచరణ్ కూడా తన సతీమణిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వెకేషన్స్ కి తీసుకెళుతున్నారు. చిరు నివాసంలో వరుసగా పార్టీలు కనుల పండుగలా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఉపాసన సీమంతం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement