Friday, May 10, 2024

రూ.25 కోట్ల ముడుపులు…మాట‌ల మంట‌లు…

బీజేపీ-కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ నుంచి రూ.25 కోట్లు ముడుపులు అందాయన్న బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన మాటల మంటలు ఆదివారమూ కొనసాగాయి. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో భారాస నేతలు సైతం రంగంలోకి దిగడంతో తెలంగాణ రాజకీయాలు మరింత రక్తి కట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ను బద్నాం చేయడానికే ఈటల అలాంటి ఆరోపణలు చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో సహా పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ- బీఆర్‌ఎస్‌ కుట్రతోనే వ్యవహరిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌- బీఆర్‌ఎస్‌ పొత్తు ఖాయమని, తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం కోసం బీఆర్‌ఎస్‌ ఆర్థిక సహాయం చేసింది, చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇరుపార్టీల మధ్య మాటల మంటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రేవంత్‌- ఈటల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు అంతా రాజకీయ డ్రామగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అభివర్ణించారు…
రేవంత్‌కు దమ్ముంటే ఈటలపై పరువు నష్టం దావా వేయాలన్నారు. ఇతర పార్టీలకు డబ్బులిచ్చే ఖర్మ, అవసరం బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభబ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు- ఇచ్చారన్న భాజపా నేత ఆ పార్టీ హుజురాబాద్‌ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమార రేపుతున్నాయి. ఈ అంశం తెలంగాణ రాజకీ యాల్లో సంచలనంగా మారింది. బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు అగ్గిమీద గుగ్గిల మయ్యారు. ఈటలకు మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నిలిచారు మునుగోడు ఎన్నికకు సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు కాంగ్రెస్‌కు ఇచ్చింది నిజమేనని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కేసీఆర్‌ నిధులను సమకూరుస్తున్నా రంటూ సంచ లన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో అంత ర్యుద్ధం తారాస్థాయికి చేరిందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించేందుకు సన్నాహాలు మొదల య్యాయని అందుకే భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఏడ్చి తన పదవిని కాపాడుకునే నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌, భారాస ఒకటేనని ఈ రెండు పార్టీలు జత కట్టా యని ఈ పా ర్టీల నడుమ మైత్రి బం ధం అంత కంతకూ పెరు గు తూ బల ప డు తోందని ఈటల రా జేందర్‌ ఆది వారంనాటి వ్యా ఖ్యలు రాజ కీయా ల్లో కలకలం సృష్టి స్తున్నాయి. భాగ్య లక్ష్మి ఆలయం బయట రేవం త్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఈటల రాజేందర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేం దర్‌ను అడ్డుకునే దమ్ము.. రేవంత్‌ రెడ్డికి ఉందా? సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించాను తప్పితే.. తాను రేవంత్‌ పేరును ఎక్కడా ప్రస్తావించ లేదని వివరణ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఇచ్చానని మాత్రమే చెప్పా నని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, భారాసాలు ఢిల్లీలో చెట్టా పట్టాలేసుకుని తిరిగాయని, రాహుల్‌ గాంధీపై అనర్హత ప్రకటిం చాక కాంగ్రెస్‌ కన్నా భారాస ఎక్కువగా స్పందిం చిందని అన్నారు. భాగ్యలక్ష్మి గుడి వద్ద రేవంత్‌ కన్నీళ్లు పెట్టు-కోవడాన్ని ఈటల తప్పు బట్టారు. ధీరుడు దీక్ష దత్తు డేవరు కన్నీళ్లు పెట్ట రని బరిగీసి కొ ట్లా డాలేతప్ప ఏడ వడం ఏంటని ప్రశ్నిం చారు. తనను ఉద్దే శించి నీ అబ్బ నీ యమ్మ అంటూ రేవంత్‌ నీ చంగా మాట్లా డారని, ఆయనకు అ య్యా అమ్మా లేరా అంటూ దు య్య బ ట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియ ర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే కూడా భారాసతో పొత్తుకు సంకేతాలిస్తున్నారని అన్నారు. భారాసతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టు-కుంటే తాను ముఖ్యమంత్రి కాలేమోనన్న అక్కసు, ఆవేదన, దుగ్దతో కన్నీరు కారు స్తూ తన లాంటి ఉద్యమ కారుడిని విద్యార్థి దశ నుంచే పోరాటం చేసిన నేత ను పట్టు-కుని దుర్బా éషలాడ వచ్చా అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సమస్యలపై పోరా డతాడనుకున్నా కానీ.. ఇలా కన్నీళ్లు పెట్టు-కుంటాడని అనుకోలేదని అన్నారు. ధీరుడు ఎప్పుడూ.. కన్నీళ్లు పెట్టు-కోరని హితవు పలికారు. కన్నీళ్లు పెట్టు-కుంటూ సంస్కారం హీనంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు- కేసులో జైలుకు వెళ్లారని.. ప్రజల కోసం తను ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు రేవంత్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపిం చారు. కోమటిరెడ్డి, జానారెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తుపై పరోక్షంగా చెప్పింది నిజం కాదా అని కాంగ్రెస్‌ను నిల దీశారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు.. హుందా తనంగా వ్యవహరించాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభ కోణంపై రేవంత్‌ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పా లని ఈటల డిమాండ్‌ చేశారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీ యాలు రేవంత్‌రెడ్డి మాను కోవాలని సూచిం చారు. సింగరేణి, నిరద్యోగ భృతిపై కొట్లాడదాం వస్తావా రేవంత్‌ అంటూ పరోక్షంగా సంబోధించారు.

కేసీఆర్‌, అమిత్‌ షా ఇద్దరూ ఇద్దరే: కాంగ్రెస్‌ నేత మహేష్‌
కాంగ్రెస్‌ పార్టీపై భాజపా నేతలు చేస్తున్న ఆరోపణ లను కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ తిప్పికొట్టారు. భారాస అవినీతిపై పోరాడుతున్న ఏ-కై-క పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. కేసీఆర్‌, అమిత్‌ షా ఇద్దరు ఒకటేనని మండిపడ్డారు. తమ పార్టీపై ఈటల చేస్తున్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇద్ద‌రిదీ రాజ‌కీయ డ్రామానే…
పీసీసీ చీఫ్‌ రేవంత్‌, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నడుమ సాగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలను రాజకీయ డ్రామాగా భారాస అభి వర్ణించింది. రేవంత్‌కు దమ్ముంటే ఈటల పై పరువు నష్టం దావా వేయాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేం దర్‌ సవాల్‌ విసిరారు. ఇతర పార్టీలకు డబ్బులిచ్చే ఖర్మ అవసరం భారాసకు లేదన్నారు. భాగ్య లక్ష్మి ఆల యం సమీపంలోనే హైకోర్టు ఉందని రేవంత్‌ అక్క డికి వెళ్లి కేసు వేయాలని సూ చిం చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement