Monday, May 20, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహ‌న్..!

ద‌ర్శ‌కుడు సుజిత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుర్ర హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సీతమ్’లో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో యంగ్ బ్యూటీలు మెరవ‌బోతున్నారు. ఈక్రమంలో పవన్ – సుజీత్ కాంబోలోని ‘ఓజీ’కి హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అందం, నటనలో ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంక మోహన్ .. పవన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ బ్యూటీకి సరైన హిట్లు లేవు. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కడం ఆమె కేరీర్ మంచి బూస్ట్ నిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గతేడాది తమిళ స్టార్స్ సూర్య నటించిన ‘ఈటీ’, శివకార్తీకేయ నటించిన ‘డాన్’ చిత్రాలతో ప్రియాంక హీరోయిన్ గా అలరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement