Friday, April 26, 2024

అఫీషియల్: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఓటీటీ డేట్ వచ్చేసింది

సుదీర్ఘ విరామం తర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన ‘వ‌కీల్ సాబ్’ సినిమాపై క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ప‌డింది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ప‌లు ఆంక్ష‌ల కార‌ణంగా ఊహించిన స్థాయిలో కలెక్షన్‌లను రాబట్టలేకపోయింది. తొలివారం సెలవుల కారణంగా మంచి కలెక్షన్లు రాబట్టినా కరోనా కేసుల కారణంగా ఆ తర్వాత వసూళ్లు నెమ్మదించాయి. అయితే థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన 56 రోజుల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ కండిష‌న్ పెట్టిన నిర్మాత దిల్ రాజు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముందుగా రిలీజ్ చేద్దామ‌న్న అమెజాన్ ప్రైమ్ ప్ర‌తిపాద‌న‌కు అంగీకరించాడు. ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాసన్ నటించింది. అంజ‌లి, నివేథా థామ‌స్, అన‌న్య‌, ప్ర‌కాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. హిందీలో వ‌చ్చిన ‘పింక్’ రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెర‌కెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement