Friday, April 26, 2024

ఆసిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జడ్డూ..

‘ఆసిక్స్’ తన బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాను నియమించింది. టీమిండియాకైనా, ఐపీఎల్ టీమ్ కైనా ఒకేరకం అంకింతభావం కనబరిచే జడ్డూపై ‘ఆసిక్స్’ దృష్టి పడడంలో ఆశ్చర్యమేమీలేదు. రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్నాడు. భారత్ లో ‘ఆసిక్స్’ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడ్నవడం పట్ల ఎంతో గర్విస్తున్నానని, చాలా థ్రిల్ ఫీలవుతున్నానని వెల్లడించాడు. మనసులను, శరీరాలను సరికొత్త శక్తి దిశగా నడిపించే బ్రాండ్ ‘ఆసిక్స్’ తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నానని జడేజా సోషల్ మీడియాలో స్పందించాడు. ఈ సందర్భంగా కరోనాతో జాగ్రత్తగా ఉండాలని జడేజా సందేశం అందించాడు. ఈ పరీక్షా సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం, శుభ్రంగా కడుక్కోవడం వంటి రక్షణ చర్యలు పాటించాలని సూచించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement