Friday, April 26, 2024

అల్లు అర్జున్ కి పాన్ మ‌సాలా.. ఆయ‌న సమాధానం ఎంటో తెలుసా..

బాలివుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ తర్వాత ఇప్పుడు టాలివుడ్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌కి పాన్ మసాలా కంపెనీ నుంచి భారీ ఆఫ‌ర్ వచ్చింది. సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత.. భారతీయ సినిమా టాప్ స్టార్లలో ఒకరిగా మారారు. కాగా.. ఓ పాన్ మ‌సాలా కంపెనీ నుండి భారీ మోత్తంలో ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే అల్లు అర్జున్ ఏమాత్రం సంకోచించకుండా ఆ ఆఫ‌ర్ కి నో చెప్పేసాడ‌ట‌… దీని వెనుక గల కారణాన్ని అన్వేషించగా, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా పొగాకు తీసుకోరని.. కాబట్టి తన అభిమానులు ఆ ప్రకటన చూసి అది వాళ్లు వినియోగించ‌కూడ‌ద‌ని దానికి బానిస‌లు కావ‌ద్ద‌ని అల్లు అర్జున్ కోరుకుంటున్న‌ట్టు తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement