Monday, April 29, 2024

జియో సినిమాలో.. తోడేలు

ఓటీటీ సంస్థ జియోలో రిలీజ్ కానుంది తోడేలు మూవీ. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో మే 26వ తేది నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రానుంది. ఇటీవలే సీక్వెల్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్‌ ప్రకటించాఈ చిత్రంలో హీరోగా వరుణ్ ధావన్ నటించాడు. హిందీ సినిమా ‘భేడియా’ను తెలుగులో గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించారు..అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. హారర్ కామెడీ సినిమాలు ‘స్త్రీ’, ‘రూహి’ తర్వాత దినేష్ విజయన్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేట‌ర్ కామెడీ జానర్ మూవీ ‘తోడేలు. గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అందివ్వడం ప్లస్ పాయింట్. మనిషి తోడేలుగా మారడం, అడవి, అడవిలో పున్నమి వీటన్నింటినీ చాలా సహజంగా, ఒళ్ళుగగుర్పొడిచే విధంగా చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement