Tuesday, April 30, 2024

క‌స్ట‌డీ యునివ‌ర్శిల్ స‌బ్జెక్ట్ …

అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, తమిళ చిత్రం కస్టడీ. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శుక్రవారం కస్టడీ విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వెంకట్‌ ప్రభు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
కస్టడీ సినిమాకు ఎలా ప్లాన్‌ జరిగింది.?
కోవిడ్‌ సమయంలో ఈ కథ ఆలోచ న వచ్చింది. స్ఫూర్తి మలయాళం సినిమా నయట్టు-. అయితే అందులో కమర్షియల్‌ ఎలి మెంట్స్‌ వుండవు. తెలుగు తమిళ ప్రేక్షకుల కోసం చేసిన్నపుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుండాలి. పెద్ద ఆశయాలతో వున్న ఒక సాధారణ కాని స్టేబుల్‌ కథ చెప్పాలనేది ఆలోచన. అలా రాయడం మొదలుపె ట్టాను. అలా కస్టడీ పుట్టింది.
ఇందులో ప్రేమకథ కూడా వుంటు-ందా ?
శివ ఒక చిన్న టౌన్‌ నుంచి వచ్చిన కానిస్టేబుల్‌. తనకి కుటు-ంబం వుంటు-ంది. అలాగే ప్రేమ కూడా వుంటు-ంది. సినిమా శివకి వచ్చిన సమస్యతో మొదలౌతుంది. తనది కాని సమస్య తను ఎదురుకోవాల్సి వస్తుంది. ఇది యూనివ ర్స ల్‌ సబ్జెక్ట్‌. అందరూ ఎంజాయ్‌ చేసేలా వుంటు-ంది.


అరవింద్‌ స్వామీకి పెద్ద ఇమేజ్‌ వుంది కదా ?
చైతు కంటే పవర్‌ఫుల్‌గా కనిపించే వ్యక్తి కావాలనే ఆలోచనతో అరవింద్‌ స్వామీని తీసుకోవడం జరింగింది.
నాగచైతన్య నటన గురించి ?
నాగచైతన్య అద్భుతమైన నటు-డు. ఈ చిత్రంలో కొత్త చై ని చూస్తారు. నా సినిమాల్లో హీరోలని డిఫరెంట్‌గా చూపించడానికి ఇష్టపడతాను.
మ్యూజిక్‌ ఎంత బలం చేకూర్చుతుంది.
-టైలర్‌లో వినే వుంటారు. ఇళయరాజా గారు, యువన్‌ శంకర్‌ రాజా మంచి మ్యూజిక్‌ చేశారు. కస్టడీ మ్యూజిక్‌ బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌.
రెండు భాషల్లో చేయడం ఎలా అనిపించిది ?
చాలా కష్టమైన టాస్క్‌ ఇది. ప్రతి షాట్‌ రెండు సార్లు సీజీ చేయాలి. డైలాగ్స్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, రెండు భాషల్లో సెన్సార్లు ఒకటి కాదు.. దాదాపుగా రెండు సినిమాలు తీసినట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement