Sunday, May 5, 2024

Ooru Peru Bhairavakona స్పెషల్‌ ప్రీమియర్స్ అప్‌డేట్ !

సందీప్ కిషన్ తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన . వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ డ్రామా సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన పెయిడ్‌ ప్రీమియర్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్‌ ప్రీమియర్స్ వేయబోతున్నారు.

ఈ స్పెషల్ షోలు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మూవీని హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement