Tuesday, May 7, 2024

TS | రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా రేపు (గురువారం) అన్ని విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సర్కార్‌ సెలవు ప్రకటించింది. రేపు గురువారం ష-బ్‌-ఎ-మెరాజ్‌ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హాలిడే క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్‌-ఎ-మెరాజ్‌కు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 8వ తేదీని సాధారణ సెలవుగా కాకుండా ఐచ్ఛిక సెలవుగా ప్రకటించారు. తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement