Sunday, May 5, 2024

AP | కేంద్రకారాగార రిమాండ్ ఖైదీ మృతి..

ఆరిలోవ, (ప్రభాన్యూస్): కేంద్ర కారాగారంలో గత సంవత్సరం జులై నెల నుండి రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు జైలు పర్యవేక్షణాధికారి కిషోర్ కుమార్ తెలియజేసారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోడా పోతన్న(45)పెదబయలు మండలం అల్లూరి జిల్లాకు చెందిన వ్యక్తి. గంజాయి కేసులో 2023 జులై నెలలో కేంద్ర కారాగారానికి రిమాండ్ ఖైదీగా వచ్చాడు.

అయితే మంగళవారం ఉదయం గుండెలో నొప్పి వస్తుందని చెప్పడంతో జైలు వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు కెజిహెచ్ కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ నొప్పి ఎక్కువ అవడంతో ఆయన మృతి చెందాడని, కార్డియక్ అరెస్ట్ వలన మృతి చెందినట్లు భావిస్తున్నట్లు జైలు సూపరిండెంట్ తెలిపారు. సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసామని ఆయన పేర్కొన్నారు.

మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం:

మంగళవారం మృతి చెందిన రిమాండ్ ఖైదీ కోడ పోతన్న ను సెంట్రల్ జైల్లో హింసించి కొట్టడం వలనే చనిపోయాడని మృతుని భార్య కోడ తులసమ్మ ఆరోపణలు వ్యక్తం చేస్తూ కె.జీ హెచ్ మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేశారు.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని,జుడీషియల్ ఎంక్వైరీ చేయాలని సంబంధిత పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement