Monday, April 29, 2024

గూని బాబ్జి…లుక్ అదుర్స్

టాలీవుడ్ నటుడు రావు రమేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించగలరు రావు రమేష్. ఇక ఈ రోజు రావు రమేష్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమా లో రావు రమేష్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో రావు రమేష్ గూని బాబ్జి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఆర్ఎక్స్ 100తో సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. అలాగే ఈ సినిమాలో అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement