Monday, April 29, 2024

ఆనందయ్య కు సపోర్ట్ గా జగపతిబాబు

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్నా నాటు మందు ను ఆయుర్వేద మందుగా పరిగణించాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చాలామంది ఆనందయ్య కు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా నిలుస్తున్నారు. కోట్లాదిమంది ఆనందయ్య మందును నమ్ముతున్నారు. ఆ మందు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.

కాగా ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా ఆనందయ్య కు సపోర్ట్ గా నిలిచాడు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆనందయ్య ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆనందయ్య ను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందని పిస్తోంది. ఆనందయ్య గారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి అంటూ జగపతిబాబు ట్వీట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement