Tuesday, May 7, 2024

కృష్ణవంశీతో ఎన్టీఆర్ @ రైతు

ఎన్టీఆర్ కృష్ణ వంశీ పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రాఖీ సినిమా. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికి నటుడిగా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం….ఈ కథ గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం… రైతుల సమస్యలు చుట్టూ తిరుగుతోందని రైతుల సమస్యలు తిరుగుతుందని తెలుస్తోంది.

నిజానికి బాలకృష్ణ 100వ సినిమా కోసం కృష్ణవంశీ రైతు అనే ఒక కథను వినిపించాడు. వినోదంతో పాటు సందేహం కూడా కలిగి ఉన్న కథ కావడం వల్ల… బాలకృష్ణ ఈ సినిమాకు ఓకే చెప్పాడు అని అందరూ అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఓకే చెప్పలేదు. ఇప్పుడు ఆ కథను ఎన్టీఆర్ తో చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఎన్టీఆర్ అందుకు ఓకే చెబుతాడో లేదో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement