Monday, May 6, 2024

ఎన్టీఆర్ హీరోయిన్ ఫిక్స్ ??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇక అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. కానీ దాదాపుగా కీయరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే అని ఎన్టీఆర్ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. గతంలో కొరటాల భరత్ అను నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది కీయరా అద్వానీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement