Thursday, May 2, 2024

ఆ ప్రకటన కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మొదట త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. కానీ దానిని వాయిదా వేస్తూ కొరటాల తో సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని సెలెక్ట్ చేశారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి. అయితే ఈ వార్త విన్న అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్… అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

గతంలో అరవింద సమేత సినిమాకు అనిరుధ్ సంగీతం ఇవ్వాల్సి ఉండగా… అది మిస్ అయింది. ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నారు ఫాన్స్. మరి ఎన్టీఆర్ కు అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ను ఇస్తారో చూడాలి. గతంలో అజ్ఞాతవాసి గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించారు అనిరుధ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement