Friday, May 3, 2024

జియో నుంచి మరో అద్భుతమైన ఆఫర్.. రూ.98కే 1.5 జీబీ

రిలయన్స్‌ జియో మరో అద్భుతమైన ప్లాన్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం రూ. 98 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్‌ కూడా ఉంటుంది.

కాగా గత ఏడాది జియో రూ .98 ప్లాన్ ను నిలిపివేసింది. దీనికి బదులుగా ఇది రూ .129 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. మళ్లీ ఈ ప్లాన్‌ను ముందుకు తీసుకువచ్చారు. జియో ఫోన్‌ యూజర్లకు అతి తక్కువ ధరకు అంటే రూ.39, రూ .69 ప్లాన్‌లు ఉన్నాయి. రెండు ప్లాన్ ల వ్యాలిడిటీ 14 రోజులు. కాగా, రూ .39 ప్లాన్‌ డైలీ 0.1 జీబీ డేటాను అందిస్తుంది. రూ .69 ప్లాన్‌ 0.5 జీబీ రోజువారీ డేటా అందిస్తోంది. తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్లు తీసుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాన్లు మంచి ఛాయిస్.

ఈ వార్త కూడా చదవండి: వాట్సాప్‌లో మరో ఆకట్టుకునే ఫీచర్

Advertisement

తాజా వార్తలు

Advertisement