Monday, April 29, 2024

సోషల్ మీడియా లో ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ వార్

ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అలియా భట్ కూడా నటిస్తున్నారు. మరోవైపు 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ కొమరం భీమ్ లుక్ కు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు శాటిలైట్ డిజిటల్ రైట్స్ 325 కోట్లకు జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సొంతం చేసుకుంది.

కాగా ఆ క్రెడిట్ మా హీరోదంటూ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చరణ్ కు వ్యతిరేకంగా… చరణ్ అభిమానులు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా#FanBaselessRamCharan, #FanBaselessNTR హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్ చరణ్ మాత్రం మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఈ వార్ నడుస్తోంది. మరి దీనిపై స్టార్ హీరోలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement