Tuesday, April 30, 2024

కరోనా బాధితులకు అండగా నిఖిల్…మరో వ్యక్తికి సహాయం

దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారని గతంలో హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరోనా తో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందికి సహాయపడుతున్నాడు నిఖిల్. ఫ్రెండ్స్ తో కలిసి ఒక టీమ్ గా ఏర్పడి పేషెంట్లకు తోచిన సహాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి….నా సోదరుడు కరోనా తో హాస్పిటల్ లో ఉన్నాడు. ఇప్పటికే చాలా అప్పులు చేశాము. చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలి అంటూ నిఖిల్ కు ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన నిఖిల్ అవసరమైన డబ్బులు పంపిస్తాను.. మీకు కావలసిన పని పూర్తయింది. త్వరలోనే మీ సోదరుడు కూడా రికవరీ అవుతాడు అంటూ రిప్లై ఇచ్చారు. నిఖిల్ గతంలో కూడా చాలా ఎంతో మందికి సహాయం చేశాడు. ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో నిఖిల్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement