Monday, April 29, 2024

పల్స్ ఆక్సిమీటర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు మరణాల రేటు కూడా పెరిగింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సామాన్యులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే ఆక్సిజన్ దొరుకుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. అసలు చాలా మంది కాస్త ఊపిరి ఆడక పోయినా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని భావించి కంగారు పడిపోతున్నారు. ఈ సందేహాలకు చెక్ పెట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మన దగ్గర ఆక్సిమీటర్ తప్పక ఉండాల్సిందే.

పల్స్ ఆక్సిమీటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. పల్స్ ఆక్సిమీటర్‌ను వాడే ముందు ఈ విషయాలను ఒక్కసారి గుర్తుంచుకోండి. మన గోళ్ళకు నెయిల్ పాలిష్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నెయిల్ పాలిష్ ఉంటే ఆక్సి మీటర్ సరిగా పనిచేయదట. ఆక్సిమీటర్ వాడాలి అనుకున్నప్పుడు చెక్ చేసుకునే వ్యక్తి కనీసం ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఎలాంటి టెన్షన్ పడకూడదు. ఆక్సిమీటర్‌లో మధ్య వేలు, లేదా చూపుడు వేలు మాత్రమే ఉంచాలి. అలాగే మరో చేతిని మీ గుండెపై ఉంచాలి. రీడింగ్ వచ్చే సమయంలో పూర్తిగా స్థిరంగా ఒక నంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆ నంబర్‌ను సరిగా రికార్డు చేసుకోవాలి. ఒక రోజులో ఇలా మూడు సార్లు మీ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకొని రికార్డు చేసుకోవాలి. అప్పుడే రక్తంలో మన ఆక్సిజన్ లెవెల్స్ మారుతూ ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. కొంతమందికి పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు అంటే 93కి చేరినప్పుడు.. పదేపదే చెక్ చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఈ న్యూస్ కూడా చదవండి: ఈ కరోనా వేరియంట్ చాలా ప్రమాదకరం.. టీకాలనూ బోల్తా కొట్టిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement