Sunday, April 28, 2024

Niharika : త‌మిళ మూవీలో హీరోయిన్ గా నిహారిక‌…

ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత మెగా డాటర్.. మద్రాస్కరణ్ అనే తమిళం మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇటీవల భారీ హిట్ అయిన ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ మాలీవుడ్ నటుడు షేన్‌ నిగమ్‌ కు జోడీగా కనిపించనుంది.

ఈ చిత్రాన్ని ఎస్‌ ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది షేన్ నిగమ్ తమిళ డెబ్యూ మూవీ కావడం విశేషం. నిహారికకు ఇది రెండో తమిళ చిత్రం. గతంలో ఒరు నల్ల బల్ పాతు సోల్రన్ అనే తమిళ సినిమాలో నటించింది మెగా డాటర్. తాజాగా ఈ సినిమా నుంచి నిహారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీతోపాటు నిహారిక.. మంచు మనోజ్ తో వాట్ ద ఫిష్ అనే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె బర్త్ డే సందర్భంగా ఆ మూవీ మేకర్స్ నిహారిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement