Sunday, May 5, 2024

మహేష్ తో నవీన్ పోలిశెట్టి సినిమా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం జిఎంబి బ్యానర్ లో యంగ్ హీరో అడవి శేషు హీరోగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జులై లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మహేష్ మరో సినిమా నిర్మాణానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జాతిరత్నాలు సినిమాతో హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తో సినిమా చేయడానికి మహేష్ రెడీ అయ్యాడట.

అయితే మహేష్ తాను నిర్మించే సినిమాలకు కథలను కూడా తానే ఎంపిక చేస్తున్నాడట. నవీన్ పోలిశెట్టి తో మహేష్ నిర్మించే సినిమాకు కూడా నూతన దర్శకుడు వీర శేఖర్ పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement