Wednesday, May 1, 2024

నవరస ట్రైలర్ రిలీజ్

నవరస వెబ్ సిరీస్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. 9 ఎపిసోడ్ లుగా ఈ సిరీస్ మొత్తం తొమ్మిది రసాలతో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సీరీస్ కు సంబంధించి పోస్టర్ లు,పాటలు, ఇంట్రడక్షన్ వీడియోలు అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా నవరస సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీపక్ భోజ్ రాజ్ కట్ చేసిన ట్రైలర్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ తొమ్మిది ఎపిసోడ్ లను అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తిక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజు, ప్రియదర్శన్, రతింద్రన్ ఆర్ ప్రసాద్, సర్జన్ కే ఎం, వసంత్ ఎస్ సాయి లు దర్శకత్వం వహించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement