Sunday, April 28, 2024

OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని “హాయ్ నాన్నా”.. ఎప్పుడంటే !

నాని ప్ర‌ధాన పాత్ర‌లో కొత్త ద‌ర్శ‌కుడు శౌర్యువ్ తెర‌కెక్కించిన లేటెస్ట్ ఎమోష‌న‌ల్ ప్యామిలీ డ్రామా ఎంటర్‌‌టైనర్ ‘‘హాయ్ నాన్నా’’. మృణాల్ ఠాకూర్.. బేబీ కియారా ఖన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ఒక పాటలో శ్రుతిహాసన్ మెరిసింది. కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.

నాని కెరియర్‌లో మరో హిట్ మూవీగా నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను వచ్చే జనవరి 19వ తేదీ లేదా.. 26వ తేదీన స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని వెయిట్ చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement