Thursday, April 25, 2024

నాంది రీమేక్… అజయ్ దేవగన్ తో దిల్ రాజు

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నాంది. ఈ సినిమా తో లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాను దర్శకుడు సతీష్ వెగ్నేష నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ ,తమిళ ,కన్నడ, మలయాళ రీమేక్ రైట్స్ ను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

తాజాగా ఆయన హిందీ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దిల్ రాజుతో కలిసి హిందీలో నాంది ని రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇక దిల్ రాజు ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు తరువాత హిట్, ఎఫ్ 2 చిత్రాలను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement