Friday, May 3, 2024

Tandel: నాగ చైత‌న్య‌,సాయి ప‌ల్ల‌విల తండేల్ మూవీ షూటింగ్ ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య.

ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. తాజాగా ‘తండేల్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న‌టిస్తున్న‌ సాయి పల్లవి ముహూర్త కార్యక్రమానికి హాజ‌రైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం మరోసారి చై-సాయి పల్లవి కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement