Monday, April 29, 2024

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ వివాదంపై నాగ్ ఫైర్ !!

అక్కినేని సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కాగా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సమంత పాత్ర పై వివాదం తలెత్తింది. తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని ఏకంగా లేఖ కూడా రాసింది. అయితే సమంత పాత్ర పై లేచిన ఈ వివాదంపై నాగ్ సీరియస్ గా ఉన్నాడట.

సిరీస్ లో అసలు ఏముందో తెలియకుండా ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడుతున్నాడట నాగార్జున. అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు…అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ నాగ్ కు రిక్వెస్ట్ చేశారట. ల్ ఇప్పటికిప్పుడు ఈ విషయంపై స్పందించవద్దని విడుదల తర్వాత అన్ని సందేహాలు దుష్ప్రచారాలు పోతాయని దర్శకనిర్మాతలు చెప్పారట. దీనితో నాగ్ కూడా రిలీజ్ వరకు మౌనం గా ఉండాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement