Sunday, April 28, 2024

Ashika: జిమ్ లో నా సామి రంగ‌…

ఆషికా రంగనాథ్.. క్యూట్ లుక్స్ కు ఓ ఇమేజ్ అంటారు టాలీవుడ్ సినీ ప్రియులు. గతేడాది నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టినప్పటికీ.. ఆషిక గ్లామర్ కు మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో సెకండ్ మూవీకే నాగార్జునతో నా సామి రంగ నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో ఆషిక ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంటోంది. శారీల్లో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తూ దేవ కన్యలా ఫిదా చేస్తోంది. నెటిజన్లను ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుంటోంది. తాజాగా బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ తన వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేసింది. నిజమైన వర్కౌట్స్ సెషన్ అంటే ఏంటో తన ట్రైనర్ గుర్తు తెస్తారని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆషిక వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ మారింది. టైట్ జిమ్ వేర్ వేసుకున్న ఆషిక.. ప్రతీ ఒక్క ఎక్విప్ మెంట్ తో ఓ రేంజ్ లో వర్కౌట్స్ చేసింది. ఎలాంటి పరికరం అయినా తగ్గేదేలే అంటూ జిమ్ చేసింది. మధ్యలో క్యూట్ నవ్వుతూ రిలాక్స్ అయింది. వార్మప్ తో పాటు యోగాసనాలు కూడా వేసింది. ఆషిక వర్కౌట్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement