Friday, October 11, 2024

Record | వీకెండ్ లో ఆ నాలుగు సినిమాల జోరు.. 400కోట్ల క‌లెక్ష‌న్..

వందేళ్ళకి పైగా వున్న దేశ స‌నీచరిత్రలో గత వారం రిలీజ్ అయిన సినిమాలు ఒక రికార్డు సృష్టించాయి. కోవిడ్ త‌రువాత‌ సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు రావటం లేదు అనుకున్న సమయంలో ఇలాంటి రికార్డు భారతీయ చిత్ర పరిశ్రమకి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత వారం విడుదలైన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ కలెక్షన్స్ సృష్టించినట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్, మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

గత వారం ఆగస్టు 11 నుండి 13 వరకు (అంటే శుక్రవారం నుండి ఆదివారం వరకు) విడుదలైన ( చిరంజీవి ‘భోళాశంకర్’, రజినీకాంత్ ‘జైలర్’, అక్షయ్ కుమార్ ‘ఓఎంజి 2’ , సన్నీ డియోల్ ‘గదర్ 2’) సినిమాలు అన్నీ క‌లిసి మొత్తం 390కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయని మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా త‌న‌ నివేధిక‌లో పేర్కోంది. భారతీయ సినిమా హిస్ట‌రీలోనే ఒక రికార్డు అని సినీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement