Wednesday, May 15, 2024

కామారెడ్డికి కెటిఆర్ వరాల జ‌ల్లు ….

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల‌ రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆర్ అండ్ బీ చౌరస్తా వద్ద కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దాదాపు రూ. 28 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఆరు వరుసల రోడ్డు, స్వాగత‌ తోరణం, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేయాలని గంప గోవర్ధన్, సీఎం కేసీఆర్‌ను కోరగా, రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఈ రోజే ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు.

అలాగే పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని, కోరగా తానూ మంజూరు చేసినట్లు తెలిపారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపి బిబి పాటిల్, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement