Monday, April 29, 2024

సినిమాల్లోకి ఎన్టీఆర్ బావమరిది

వెండి తెరపైకి మరో సినీ వారసుడు రాబోతున్నాడు. అయితే వచ్చే హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కావడం విశేషం. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్, తారక రత్న హీరోలుగా పలు సినిమాలు చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నటనలో, డ్యాన్సులు, ఫైట్లలో శిక్షణ తీసుకున్న నార్నె నితిన్ సినీరంగ ప్రవేశం కోసం పక్కాగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. స్టార్ డైరక్టర్ తేజ అతడిని పరిచయం చేస్తున్నట్లు సమాచారం. ‘చిత్రం’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘చిత్రం 1.1’లో నార్నె నితిన్ నటించబోతున్నాడని టాక్. కాగా ఏప్రిల్ 18న నార్నె నితిన్ చంద్ర హీరోగా న‌టించ‌బోయే సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement