Tuesday, April 30, 2024

బీస్ట్ సెట్స్ లో సందడి చేసిన MSD

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్టున్న బీస్ట్ సెట్స్ లో క్రికెటర్ ఎమ్ ఎస్ ధోని సందడి చేశారు. ఇటీవల చెన్నైలో పర్యటించిన ధోని..హీరో విజయ్ ని కలిశాడు. విజయ్ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్నప్పటి నుంచి ధోనితో విజయ్ కి మంచి సన్నిహిత్యం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement