Friday, April 26, 2024

Gangs of Godavari : మోత మోగిస్తున్న‌ది ….

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ కనిపిస్తారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్‌ నుండి ” సుట్టంలా సూసి…” పాట విడుదలైంది. తాజాగా ”మోత.. ” అనే మరో పాటని విడుదల చేశారు.

- Advertisement -

ఈ పాట థియేటర్లలో మోత మోగుతుందని చిత్ర బృందం భావిస్తోంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఎంఎం.మానసి ఆలపించింది. ఈ పాటలో విశ్వక్‌ సేన్‌, ఆయేషా ఖాన్‌ కలిసి నటించారు. ఈ సినిమాలో నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసమాన్యూడిగా ఎదిగిన వ్యక్తి యొక్క ప్రయాణంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. మే 17న ఈ సినిమాను విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement