Wednesday, May 1, 2024

మోహన్‌ లాల్‌ “వృషభ” చిత్రానికి హాలీవుడ్‌ హంగులు

మూన్‌ లైట్‌ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు నిక్‌తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ‘వృషభ’ టీ-ంలోకి రావడంతో ఈ సినిమా హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌, రోషన్‌ మేక హీరోలుగా నటిస్తున్నారు.

.ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్‌, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్‌ ్టసల్‌ను ఫాలో అవుతున్న తీస్తున్న మొదటి సినిమాగా వృషభ రికార్డులకు ఎక్కింది.హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నిక్‌తుర్లో మాట్లాడుతూ ”వృషభ అనేది నా మొదటి ఇండియన్‌ సినిమా. ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హాలీవుడ్‌ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇది. వృషభ ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత విశాల్‌ గుర్నాని మాట్లాడుతూ ”హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నిక్‌ తుర్లో వంటి వారు మా ప్రాజెక్టులోకి రావడం కలలా ఉంది. ఆయన ఈ సినిమాలోకి రావడంతో స్థాయి పెరిగింది. ”అని అన్నారు.తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్‌ ఎమోషనల్‌ డ్రామాగా వృషభ రాబోతోంది. మోహన్‌ లాల్‌, రోషన్‌ మేక, శనయ కపూర్‌, జహ్రా ఖాన్‌, శ్రీకాంత్‌ మేక, రాగిణి ద్వివేది వంటి వారు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement