Monday, May 29, 2023

మాస్ పోలీస్ గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మీటర్ ట్రైల‌ర్ రిలీజ్

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న తాజా చిత్రం మీట‌ర్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో తెర‌కెక్కుతోంది.. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వరంకి జోడీగా అతుల్య రవి అలరించనుంది. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. మాస్ డాన్సులు .. ఫైట్లను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. క్లాప్ – మైత్రీ బ్యానర్లలో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది.ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement