Monday, May 6, 2024

కోలీవుడ్ ఫైట్ మాస్టర్ కు మెగాస్టార్ ఆర్థిక సహాయం

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయ పడుతూ ఉంటారు. ఇక తాజాగా ఓ కరోనా కారణంగా ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోవడంతో… ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బాంక్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు చిరు. అలాగే ఎంతో మందికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు.

తాజాగా కోలీవుడ్ కి చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్ పొన్నం బలం కు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు మెగాస్టార్. కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం చిరు ఆ మొత్తాన్ని అందించారని అందుకు చిరు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వీడియో ద్వారా తెలియజేశారు పొన్నం బలం. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు పొన్నం. ఇక పొన్నం బలం ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement