Wednesday, May 8, 2024

రెండు విభిన్న గెట‌ప్స్ లో విశాల్.. మార్క్ ఆంథోని టీజ‌ర్

అధిక్ ర‌విచంద్ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం మార్క్ ఆంథోని. ఈ చిత్రం టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. జీ.వి ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రీతూవ‌ర్మ, అభినయలు హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. త‌మిళంతో పాటు, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాను రూపొందించ‌నున్నారు. కాగా ఈ మూవీలో హీరోగా విశాల్ న‌టించాడు. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తోనే మేకర్స్‌ స్పష్టం చేశారు. చిరంజీవి ఫోన్‌ అని చూపిస్తూ కాలాన్ని, సమయాన్ని మార్చగలిగే ఫోన్‌ ఇదని టీజర్‌లో వెల్లడించారు.

అయితే అది గ్యాంగ్‌స్టర్‌ మూఠాలో మేయిన్‌ అయిన విశాల్‌, ఎస్‌.జే సూర్యలకు ఇది దొరకకూడదని మిగతా గ్యాంగ్‌స్టర్లు అనుకోవడం టీజర్‌లో చూపించారు.విశాల్‌ రెండు విభిన్న గెటప్స్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా 80’ల పీరియడ్‌లో ఉన్న కాస్ట్యూమ్స్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. మొత్తంగా టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చేసినా.. మార్క్‌ ఆంటోని పీరియాడిక్‌ నేపథ్యంలో తెరకెక్కించడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. పైగా కామెడీ కూడా బాగానే దట్టించినట్లు కనిపిస్తుంది. సునీల్‌కు మంచి క్యారెక్టర్‌ పడ్డట్లు తెలుస్తుంది. సెల్వా రాఘవన్‌ క్యారెక్టర్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆంటోని చచ్చి ఇరవై ఏళ్లు అవుతుందిరా. ఆ ఒక్క రోజు మీ ప్రాణాలు కాపాడుకుంటే మీరు వ్యూచర్‌లోకి వచ్చేస్తారు అనే డైలాగ్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement