Saturday, April 27, 2024

Manjummel Boys తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

ఇటీవల మలయాళంలో విడుదలైన మూవీ మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలైన రిలీజ్ అయ్యింది. కాగా, కేవలం 20 కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్లను కలెక్ట్ చేసి ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ 6న రిలీజ్ కాబోతుంది. ఇక్కడి సినిమా ప్రేమికులు కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి తెలుగులో మంజుమ్మల్ బాయ్స్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

అదేవిధంగా.. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన భ్రమయుగం, ప్రేమలు సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. భ్రమయుగం తెలుగులో పర్వాలేదు అనిపించినా ప్రేమలు సినిమా మాత్రం ఘనవిజయం సాధించింది. మలయాళం డబ్బింగ్ సినిమా ఒక్క తెలుగులోనే 15 కోట్లు వసూలు చేయడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement