Saturday, April 27, 2024

Dasara 2 : ధరణి గాడు మళ్లీ వస్తుండు..!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘‘దసరా’’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది విడుదలై మంచి విజయం సాధించింది. సినమిఆలో నాని ఊర మాస్ లుక్, రా అండ్ రస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం నాని “సరిపోదా శనివారం’’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని, శ్రీకాంత్ దసరా 2ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలోనే దసరా 2 ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement