Tuesday, April 30, 2024

వాతి కమింగ్ మంచు లక్ష్మీ వేర్షన్..ట్రోల్స్ చేసిన నెటిజన్లు

.

తెలుగు ప్రేక్షకుల్లో నటిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది మంచు లక్ష్మీ. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ తోను.. ఇక తనకే సొంతమైన ఇంగ్లీష్ యాసతోను మంచు లక్ష్మీ అందరికి సుపరిచితమే.. తన తీరుతో తరచూ ట్రోల్స్‌ గురయ్యే మంచు లక్ష్మీ తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంది. ప్లాంక్ ని (వ్యాయమం లో ఓ ఆసనం) ఇలా కూడా చేయవచ్చు అంటూ వాతీ కమింగ్ పాటకు చీర కట్టులో సరదాగా వ్యాయమం చేసింది. ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో ఫోస్టు చేసింది. అయితే తరచూ టీ-షర్టు, ప్యాంటు దుస్తుల్లోనే యోగా, వ్యాయమం వీడియోలు షేర్‌ చేసే ఆమె ఈ సారి వెరైటిగా చీరలో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఏంటో నువ్వు ఆ దేవుడికే అర్ధం కావాలి.. ఎవరికీ అర్ధం కావు’ అని కామెంట్స్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CODON7sloO6/?utm_source=ig_web_copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement