Thursday, May 2, 2024

ఫస్ట్ లుక్ కోసం మహేష్ ఫ్యాన్స్ పక్కా ప్లానింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజుకు వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ కు వచ్చిన రెస్పాన్స్ మించి ఫస్ట్ లుక్ పోస్టర్ కు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆ లుక్ ను టాలీవుడ్ మోస్ట్ లైక్ అండ్ రిట్వీటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ గా రికార్డ్ క్రియేట్ చేయించాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement