Sunday, May 5, 2024

సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్న మహేష్ బర్త్ డే బ్లాస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారు పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా…. తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసింది.

అయితే అనుకున్న సమయం కంటే ముందుగానే ఆ సర్ ప్రైజ్ ను రిలీజ్ చేశారు. ఒక నిమిషం 17 సెకండ్లు నిడివి తో టీజర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ టీజర్ నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 2022న విడుదల కాబోతోంది.

https://youtu.be/2cVu7KZxW3c
Advertisement

తాజా వార్తలు

Advertisement