Tuesday, April 30, 2024

ఆరోజు మహేశ్‌ ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా..

మహేష్ బాబు అభిమానులకు త్వరలో ఓ గుడ్ న్యూస్ రాబోతోంది. కృష్ణ పుట్టినరోజు మే 31న. ఘట్టమనేని అభిమానులకు ఆ రోజున ఓ సినిమా టీజర్‌ విడుదల చేయడంతో పాటు మరో సినిమాకు సంబంధించిన వివరాల్ని మే 31న వెల్లడిస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రతి ఏడాదీ తండ్రి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రాన్ని ప్రారంభించడమో… కొత్త కబురు చెప్పడమో… లేదంటే సెట్స్‌ మీదున్న సినిమా ఫస్ట్‌ లుక్‌ / టీజర్‌ విడుదల చేయడమో మహేశ్‌బాబు చేస్తుంటారు. ఈ ఏడాదీ అదే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించారట.

ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. దుబాయ్‌లో, ఇండియాలో… సుమారు 40 రోజులు చిత్రీకరణ చేశారు. తండ్రి పుట్టినరోజుకు ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడికి మహేశ్‌ సూచించారట. ఆ పని మీద పరశురామ్‌ ఉన్నారని తెలుస్తోంది. అలాగే, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి మహేశ్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన ప్రకటన మే 31న రానుందని టాక్‌. దీంతో మహేష్ అభిమానులు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement