Thursday, May 2, 2024

డిజిటల్ రిలీజ్ కి మాస్ట్రో సిద్ధం!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ పర్వాలేదు అనిపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అందాదున్ రీమేక్ మాస్ట్రో సినిమాలో నటిస్తున్నాడు. క్రైమ్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్నా కీలకపాత్రలో నటిస్తోంది.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా గడుపుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఈ పనులు కూడా పూర్తికాబోతున్నాయి. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డిజిటల్ గా రిలీజ్ చేయడానికి నితిన్ మొగ్గు చూపుతున్నారట. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాస్టర్ సినిమా రిలీజ్ రిలీజ్ కానుంది. దాదాపు 40 కోట్ల రూపాయల ధరకు సినిమాను వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమాను నితిన్ సొంత బేనర్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement