Monday, April 29, 2024

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ నుంచి లిరికల్ వీడియో సాంగ్

హ్యాపీడేస్ సినిమాతో నటుడిగా కెరీర్ ను ప్రారంభించి కొత్త బంగారులోకం సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. అయితే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో ఇందువదన అనే మూవీ చేస్తున్నాడు వరుణ్. ఈ ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా తాజాగా పొడిపొడిగా సుడిగాలిలా అంటూ తాగే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హీరోయిన్ గిరిజన యువతిగా కనిపించగా… మోడ్రన్ లుక్ లో వరుణ్ సందేశ్ కనిపించారు. ఇక ఈ సినిమాకు కాకాని శివ సంగీతం అందిస్తున్నారు. అలాగే కెరీర్ పరంగా కూడా వరుణ్ సందేశ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

https://youtu.be/ywlHJtraWPY
Advertisement

తాజా వార్తలు

Advertisement