Wednesday, May 15, 2024

మందుబాబుల‌కు శుభ‌వార్త‌..తగ్గిన బీరు ధరలు.. అర్ధరాత్రి నుంచే అమలు

తెలంగాణలో అన్ని రకాల బీరు బ్రాండ్లపై రూ.10 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సెస్ నుంచి పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తగ్గింపుతో ఒక బీరుపై ఉన్న ప్రత్యేక సెస్ రూ.30 కు చేరింది. తగ్గించిన ధర ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం
చేసింది. కాగా మద్యం దుకాణాల్లోని పాత స్టాక్ కు ఇది వర్తించదు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement