Tuesday, May 7, 2024

ఇండియాలో ల్యాండ్ అయిన లగ్జరీ కారు @ఎన్టీఆర్

ఎన్టీఆర్ కు కారులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన గ్యారేజ్ లో రకరకాల కార్లు ఉండగా… తాజాగా మరో లగ్జరీ కారు ఆయన గ్యారేజ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లగ్జరీ కారు ఇండియాలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు ను ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.

అత్యంత విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ కారు ఒక్క ఎన్టీఆర్ దగ్గరే ఉంది. ఈ ఫోటోలను బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేసారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement