Wednesday, May 8, 2024

LUCKY: పొలిమేర కామాక్షికి ల‌క్కీ ఛాన్స్…

గతంలో ఓటీటీ లో సూపర్ హిట్ అయిన పొలిమేర సినిమాకి ఈ సినిమా కొనసాగింపుగా వచ్చిన పొలిమేర 2 సినిమా సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమాలో కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించాడు..అలాగే ఫిమేల్ లీడ్ రోల్ లో నటించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంతో ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమా లో ఆమె నటన అద్భుతంగా ఉంది.

ఇక దానికి తోడుగా ఆమె తెలుగు నటి కావడం ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలుగమ్మాయి చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌ర‌చ‌డంతో తెలుగు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఆమె వైపు చూస్తున్నారు.. దీంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో మంచి ఆఫర్స్ వెతుకుంటూ వ‌చ్చాయి. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబో లో వచ్చే సినిమా లో కామాక్షి భాస్కర్ల ను ఒక కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నారు…అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.. అయితే ఈ వార్త కనుక నిజమైతే కామాక్షి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారడం ఖాయమని చెప్పొచ్చు.. అలాగే మ‌రో టాప్ హీరో స‌ర‌స‌న రెండో హీరోయిన్ గా ఎంపికైన‌ట్లు తాజా స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement