Tuesday, May 14, 2024

Lucky Bhaskar ఫస్ట్ లుక్ రిలీజ్.. !

దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వ‌హిస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ నుండి హీరో అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లుక్‌ వైరల్ అవుతోంది. త్వరలో ఈ మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement